Skip to main content

Politics : 2022లో జ‌రిగిన రాజకీయ యాత్రలు, విజయాలు, చీలికలు ఇలా..

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్‌ జోడో యాత్ర సెప్టెంబర్‌ 7న ప్రారంభమైంది.

ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది.
➤ గాంధీ కుటుంబానికి చెందని సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు.

BJP

➤ ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్‌ హిమాచల్‌తో సరిపెట్టుకోగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్‌లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పారీ్టగానూ అవతరించింది!

☛ Celebrity deaths : 2022లో కన్నుమూసిన ప్రముఖులు
➤ బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మరోసారి యూ టర్న్‌ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్‌ బైకొట్టి తిరిగి మహాఘట్‌బంధన్‌లో చేరి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు.
➤ మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్‌నాథ్‌ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు.

sonia and rahul ed case

➤ నేషనల్‌ హెరాల్డ్‌ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్‌ గాందీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి.  పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి.

జిన్‌పింగ్‌

➤ చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ అక్టోబర్‌ 23న వరుసగా మూడోసారి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేశారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ 20వ కాంగ్రెస్‌లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చైనాలో ఈ పదవికి ఎన్నికైన వారే అధ్యక్ష పగ్గాలు చేపడతారు.  
➤ బ్రెజిల్‌లో జరిగిన ఎన్నికల్లో రైట్‌ వింగ్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరాను ఓడించిన వామపక్ష వాది లూయిజ్‌ ఇనాసియో లూలా డా సిల్వా అక్టోబర్‌ 30న నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

☛ Best Moments in India 2022 : భారత్‌లో 2022లో జరిగిన చరిత్మ్రాక మెరుపులు ఇవే..
➤ ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోని ఎన్నికయ్యారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని అక్టోబర్‌ 25న దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు.  రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో అతివాద ప్రభుత్వం ఏర్పాటుకావడం విశేషం.  
➤ ఇజ్రాయెల్‌లో మూడేళ్ల రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ మరోసారి బెంజిమన్‌ నెతన్యాహూ ప్రధాని పదవి అందుకున్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన రికార్డు నెతన్యాహూపై ఉంది. నవంబర్‌ 15న ఆయన మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టారు.  
➤ నేపాల్‌లో అయిదు పార్టీల సంకీర్ణ కూటమి కుప్పకూలిపోవడంతో మాజీ ప్రధాని, సీసీఎస్‌–మావోయిస్ట్‌ సెంటర్‌ పార్టీ చైర్మన్‌ ప్రచండ ప్రధాని పగ్గాలు చేపట్టారు. సహచర కమ్యూనిస్టు నేత కేపీ శర్మ ఓలి మద్దతుతో డిసెంబర్‌ 26న ప్రమాణ స్వీకారం చేశారు. 

☛  Issues in 2022 : భార‌త్‌లో 2022లో సంచలనం రేపిన ఘర్షనలు..

Published date : 29 Dec 2022 03:41PM

Photo Stories