Turkey Earthquake: టర్కీ సాయాన్ని తిరిగి రీ ప్యాక్ చేసి టర్కీకే పంపిన పాక్... అంతర్జాతీయంగా పరువుపోగుట్టుకున్న పాక్
సేమ్ పాకిస్థాన్ కూడా అదే పని చేసింది. గతేడాది ప్రకృతి ప్రకోపంతో పాక్‌లో కనీవినీ చూడని వరదలు సంభవించాయి. పాకిస్థానీయులు సర్వం కోల్పోయారు. ఆ సమయంలో ప్రపంచ దేశాలు పాక్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. అలాగే పాకిస్థాన్ దోస్త్ టర్కీ కూడా తన వంతు సాయం అందజేసింది.
అంతర్జాతీయంగా అబాసుపాలు..!
సీన్ కట్ చేస్తే ప్రకృతి సృష్టించిన భూకంప విలయంతో టర్కీ అల్లాడిపోతోంది.
కష్టాల్లో ఉన్న టర్కీకి భారత్ సహా ప్రపంచ దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఆర్థిక సాయంతో పాటు సహాయక సామగ్రిని కూడా పంపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కూడా ముందుకొచ్చింది. అయితే ఆ సాయాన్ని చూసి టర్కీ అధికారులు కంగుతిన్నారు. గతంలో పాక్‌కు ఆ దేశం పంపిన వరద సాయాన్ని అలాగే ప్యాక్ చేసి తిరిగి టర్కీకే పంపించింది. ఆ బాక్సులపైనున్న వివరాలను కూడా అలాగే ఉంచింది.
చదవండి: బతుకు దుర్భరం.... తన్నులాటలో ఒకరు మృతి
స్వయంగా ప్రధానే పర్యవేక్షించినా...!
వరదల సమయంలో పాక్‌కు టర్కీ సహాయక సామగ్రిని పంపింది. ఇప్పుడు అదే సామగ్రిని రీప్యాక్ చేసిన పాక్.. భూకంప సాయం కింద టర్కీకి పంపించినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అయితే పైన కొత్త బాక్సులను ఉంచిన పాక్ .. లోపల ఉన్న బాక్సులను మార్చడం మర్చిపోయింది. బయటి బాక్సులపైన.. ‘భూకంప బాధితుల కోసం పాకిస్థాన్ ప్రజలు పంపిన సాయం’ అని రాసి ఉంది. లోపల ఉన్న బాక్సుల్లో మాత్రం.. ‘వరదల్లో అల్లాడుతున్న పాక్ ప్రజలకు సాయం అందించేందుకు టర్కీ ప్రజలు పంపుతున్న సామగ్రి ’ అని రాసి ఉండటంతో పాక్ గుట్టు బయటపడింది. ఈ సామగ్రిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దగ్గరుండి పర్యవేక్షించడం గమనార్హం.
చదవండి: సీఎం.. పీఎం.. జీతాలెంతో తెలుసా...?
ఇప్పటివరకు 45 వేల మంది మృతి
గతేడాది జూన్‌లో పంపిన సాయాన్ని నష్టపోయిన ప్రజలకు అందజేయకపోవడంపైనా పాక్‌పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఎనిమిది నెలల కిందటి సామగ్రిని కనీసం చెక్ చేయకుండా తిరిగి రీప్యాక్ చేయడంపై టర్కీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టర్కీ, సిరియాలో ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు 45వేల మందికి పైగా మృతిచెందారు.