North Korea: ఈ దేశాలపై మండిపడ్డ ఉత్తర కొరియా నియంత
కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణాకొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తరకొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తామూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో అదనంగా మూడు నిఘా ఉపగ్రహాల ప్రయోగాలు చేపడతామని ప్రకటించారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ తయారు చేస్తామన్నారు. ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్‌ఏ వార్తాసంస్థ ఈ మేరకు వెల్లడించింది.
Ukraine War: ఉక్రెయిన్‌కు 250 మిలియన్ డాలర్ల మిలిటరీ సాయం
ట్రంప్ హయాంలో అమెరికాతో చర్చలు విఫలమయ్యాక అగ్రరాజ్యం నుంచి ఆక్రమణ, దాడి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కిమ్ ఆయుధ సంపత్తి విస్తరణకు తెర తీశారు. ‘‘అమెరికా, దక్షిణకొరియా కవ్వింపు చర్యలు కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. వాటి మెరుపుదాడులను తట్టుకుని నిలబడాలంటే మా సాయుధ, శక్తి సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడం అత్యవసరం’’ అన్నారు.