Skip to main content

Veterinary Vaccine: హైదరాబాద్‌లో ఐఐఎల్‌ నూతన ప్లాంటు నిర్మాణం..

పశువులకు అవసరమయ్యే వ్యాక్సిన్లను ఇక్కడ తయారు చేసేందుకు ఈ ప్లాంటును నిర్మిస్తున్నారు. ఈ మెరకు నిర్మాణలో ఉన్న ప్లాంటు గురించి వివరాలను వెల్లడించారు..
New Vaccine Manufacturing Facility by Indian Immunologicals in Hyderabad  Construction of building for manufacturing veterinary vaccines    Indian Immunologicals (IIL) New Vaccine Manufacturing Plant Construction

వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ (ఐఐఎల్‌) నూతన ప్లాంటు నిర్మాణం ప్రారంభించింది. హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌వ్యాలీలో 14 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటవుతోంది. గురువారం ఈ మేరకు నూతన కేంద్రం కోసం భూమి పూజను కంపెనీ నిర్వహించింది.

Bill Acceptance: మూడు కీలక బిల్లులకు లోక్‌సభ ఆమోదం.. అవి ఇవే..

పశువులకు అవసరమయ్యే వ్యాక్సిన్లను ఇక్కడ తయారు చేస్తారు. ఏటా 30 కోట్ల యూనిట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఇండియన్‌ ఇమ్యునాలాజికల్స్‌ ఈ ప్లాంటును స్థాపిస్తోంది. తయారీ కేంద్రం కార్యరూపంలోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Covid-19: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. దేశంలో ఎంత మంది మరణించారంటే..!

‘హైదరాబాద్‌లోని ఈ కొత్త ప్లాంటు దేశానికి అంకితం. భారత్‌లో ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీస్‌ (గాలికుంటు వ్యాధి) నిర్మూలనలో ఈ కేంద్రం సహాయపడుతుంది. అందుబాటు ధరలో వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీలో ఐఐఎల్‌ సామర్థ్యం ఖజానాకు రూ. వేల కోట్లను ఆదా చేసింది’ అని ఎన్‌డీడీబీ, ఐఐఎల్‌ చైర్మన్‌ మీనేశ్‌ షా ఈ సందర్భంగా తెలిపారు. 

Published date : 29 Dec 2023 03:10PM

Photo Stories