Skip to main content

అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

ఏటా ఏప్రిల్ 25న అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితికి సభ్య దేశాల ప్రతినిధులు, ప్రతినిధుల పాత్రపై అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం.

చరిత్ర:
అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవం శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశం మొదటి రోజు వార్షికోత్సవానికి గుర్తుగా దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అంతర్జాతీయ సంస్థపై ఐక్యరాజ్యసమితి సమావేశం అని కూడా పిలుస్తారు. ఏప్రిల్ 25, 1945న, 50 దేశాల ప్రతినిధులు శాన్‌ఫ్రాన్సిస్కోలో మొద‌టిసారి స‌మావేశ‌మ‌య్యారు.

రెండో ప్రపంచ యుద్ధం వినాశనం తరువాత ఈ సమావేశం జరిగింది. ప్రపంచ శాంతిని పునరుద్ధరించే, యుద్ధానంతర ప్రపంచ క్రమంపై నియమాలను విధించే ఒక సంస్థను ఏర్పాటు చేయడమే ప్రతినిధులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 26 జూన్ 1945న, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఈ సమావేశానికి హాజరైన 50 దేశాల ప్రతినిధులు సంతకం చేశారు. ఈ ఒప్పందం ఫలితంగా ఐక్యరాజ్యసమితి (యుఎన్) ఏర్పడింది.

యూఎన్‌లో 193 సభ్య దేశాలు స‌భ్యత్వం క‌లిగి ఉన్నాయి. దాని సభ్య దేశాల ప్రతినిధుల మధ్య సామూహిక సంభాషణలకు ప్రధాన అంతర్జాతీయ వేదికగా పనిచేస్తుంది. 2 ఏప్రిల్ 2019న, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 25 ఏప్రిల్‌ను అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవంగా ప్రకటించింది.

Published date : 19 Jun 2021 01:08PM

Photo Stories