Skip to main content

MLC Elections: మోగిన ఎన్నికల నగారా.... ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరో కొన్ని నెలల సమయం ఉండగా.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం(ఫిబ్రవరి 9) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్‌ స్థానాలకు, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది.

Notification

– ఫిబ్రవరి 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 
– మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. 
– మార్చి 16న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.

Published date : 09 Feb 2023 01:26PM

Photo Stories