Clean Survey 2023: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఈ సంస్థ ర్యాంకు..!
స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో చిత్తూరు నగరపాలక సంస్థ జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్–2023 ఫలితాలను కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో జాతీయస్థాయిలో చిత్తూరు నగరపాలక సంస్థ 143 ర్యాంకు సాధించినట్లు నగర కమిషనర్ అరుణ వెల్లడించారు. 1–10 లక్షల జనాభా కేటగిరీలో జాతీయ స్థాయిలో 446 నగరాలతో పోటీపడుతూ చిత్తూరు నగరపాలక సంస్థ 143వ సాధించిందన్నారు.
రాష్ట్రస్థాయిలో 31 నగరాలతో పోటీపడుతూ 9వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతేడాది ర్యాంకు 153 కంటే 10 ర్యాంకులు మెరుగుపరచుకున్నట్లు తెలిపారు. గతేడాది 382 నగరాలు పోటీ పడగా, ఈ ఏడాది 446 నగరాలు పోటీపడ్డాయని చెప్పారు. మనకంటే ఎక్కు వ జనాభా ఉన్న నగరాలతో పోటీపడుతూ, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, డంపింగ్ యార్డు నిర్వహణ, ఓడీఎఫ్ ప్లస్, సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో గతంలో కంటే మెరుగైన మార్కులు సాధించినట్లు తెలిపారు.
2022లో 3,433.86 మార్కులు సాధించగా, 2023లో 5,174.45 మార్కులు సాధించిందని, అమృత్ 2.0లో భాగంగా సివేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు మంజూరైనట్లు చెప్పారు. ఇవి పూర్తై అందుబాటులోకి వేస్తే మరింత మెరు గైన ర్యాంకు సాధించవచ్చన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్– 2023 లో మెరుగైన ఫలితాలు సాధించడంపై కమిషనర్ అరుణ నగర ప్రజలకు అభినందనలు తెలిపారు.