Skip to main content

Rishi Sunak: రిషి సునాక్‌ను వెంటాడుతున్న వివాదాలు.. సీట్‌బెల్ట్‌ పెట్టుకోకుంటే ఇంత రాద్ధాంతమా...!

రవి అస్తమించని రాజ్యం అంటూ విర్రవీగిన బ్రిటన్‌కు వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి. గత నాలుగేళ్లలో నలుగురు ప్రధానులు మారారు. అయినా ఆ దేశ సమస్యలు తీరడం లేదు.
Rishi Sunak

ఇప్పటికే ద్రవ్యోల్బణం కొండెక్కి కూర్చోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను గట్టెక్కిస్తాడు అనుకున్న రిషి సునాక్‌ మాత్రం రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నాడు. 
ప్ర‌ధానుల‌కు త‌ప్ప‌ని వివాదాలు...
బ్రిటన్‌ ప్రధానులకు వివాదాలు కొత్తేమీ కాదు. ఆ దేశ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వివాదాలతో సావాసం చేసేవాడు. విరాళాలతో ఇంటిని చక్కదిద్దుకోవడం, లాబీ కుంభకోణం, పించర్‌ ఎఫెక్ట్, మంత్రులపై లైంగిక వేధింపులు.. ఇలా జాన్సన్‌ని వివాదాలు వెంటాడాయి. చివరికి ‘‘పార్టీగేట్‌’’ వివాదంలో చిక్కుకుని ప్రధాని పదవిని పోగుట్టుకున్నాడు. అలాగే రిషి సునాక్‌ తన ప్రమేయం లేకున్నా కొన్ని కొన్ని వివాదాలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ‘జెట్‌’ వివాదం సద్దుమణగకముందే మళ్లీ ‘‘సీట్‌బెల్ట్‌’’ వివాదంలో చిక్కుకున్నాడు.

చ‌ద‌వండి: 2వేల మందికి స్కాలర్‌షిప్‌... ఏడాదికి 48 వేలు.. వివరాలు ఇవే


కొద్ది నిమిషాలే అయినా....
బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఒక వీడియో చిత్రీకరణ కోసం ప్రయాణంలో ఉన్న ఆయన కొద్ది నిమిషాలు పాటు సీట్‌ బెల్ట్‌ తీశారు. ఇదే ఇప్పుడు అక్కడ తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బ్రిటన్‌ ప్రధానే సీట్‌బెల్ట్‌ పెట్టుకోకపోవడం ఏంటని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఎంపీలు విరుచుకు పడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని విమర్శలు ఎక్కుపెట్టారు.  
కఠినంగా నిబంధనలు...
యూకే నిబంధనల ప్రకారం.. కారు ప్రయాణికులు సీట్‌ బెల్ట్‌ ధరించకపోతే, అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించాలి. ఇక ఆ వ్యవహారం కోర్టు వరకు వెళితే ఆ మొత్తం 500 పౌండ్ల వరకు పెరుగుతుంది. వైద్యపరమైన సమస్యలుంటే మినహాయింపులు ఉంటాయి. అయితే రిషి కావాలని అలా చేయలేదని ఆ పార్టీనేతలు చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సీట్‌ బెల్ట్‌కు ఆర్థిక వ్యవస్థకు ముడిపెట్టి మరీ మండిపడుతున్నారు.

చ‌ద‌వండి: డిగ్రీకి రూ.2 లక్షలు, పీజీకి రూ.6 లక్షలు... ఇలా చేస్తే యూజీ, పీజీ ఫ్రీ


జెట్‌లో ప్రయాణించినా విమర్శలే....
‘రిషి సునాక్‌కు తన సీట్‌ బెల్ట్, డెబిట్‌ కార్డు, ఆర్థిక వ్యవస్థ,ఈ దేశాన్ని ఎలా నిర్వహించాలో తెలీదు. రోజురోజుకూ ఈ జాబితా పెరిగిపోతోంది’ అని వరుసపెట్టి లేబర్‌ పార్టీ ఎంపీలు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల లండన్‌  నుంచి లీడ్స్‌ నగరానికి ఆయన ప్రైవేటు జెట్‌ను వినియోగించడంపైనా విపక్షాలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Published date : 20 Jan 2023 04:17PM

Photo Stories