Skip to main content

నేను బయోటెక్నాలజీలో బీఎస్సీ చేశాను. జర్మనీలో పీజీ చేయాలని ఉంది. అక్కడి కోర్సులు నా సబ్జెక్టుకు అనువుగా ఉన్నాయి. నేను...

Question
నేను బయోటెక్నాలజీలో బీఎస్సీ చేశాను. జర్మనీలో పీజీ చేయాలని ఉంది. అక్కడి కోర్సులు నా సబ్జెక్టుకు అనువుగా ఉన్నాయి. నేను ఏ కన్సెల్టెన్సీకి వెళ్లినా నిరుత్సాహపరిచారు. నాకు మంచి సలహా ఇవ్వండి?
ముందుగా జర్మనీలో పీజీ చేయాలంటే ఇక్కడ చేసే మూడేళ్ళ డిగ్రీ అర్హత సరిపోదు. మీరు డిగ్రీ స్థాయిలో  మరో రెండు నుంచి మూడేళ్ల విద్యను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇండియాలోనే మీరు పీజీ పూర్తి చేసి తర్వాత జర్మనీలో మాస్టర్స్‌ డిగ్రీకి దరఖాస్తు చేసుకుంటే బాగుంటుంది. అక్కడ మాస్టర్స్‌ అయిన తర్వాత పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. మీ అర్హత పరీక్షలో 80 శాతం మించి మార్కులు సాధించాలి. ఇక టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ లో స్కోర్లు తప్పనిసరి.

Photo Stories