Skip to main content

ప్రిపరేషన్‌ ఎలా ఉండాలి?

Question
ప్రిపరేషన్‌ ఎలా ఉండాలి?
ప్రామాణిక గ్రంథాలను ఎంచుకోవాలి. ప్రముఖ అంతర్జాతీయ రచయితలు, ఐఐటీ ప్రొఫెసర్లు రాసిన పుస్తకాలు చదివి, ప్రాక్టీస్‌ చేయడం ఎంతైనా మంచిది. గత ప్రశ్నాపత్రాలు, సిలబస్‌కు అనుగుణంగా యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌, ఫారెస్ట్‌ సర్వీ సెస్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్‌ చేయాలి. తద్వారా ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా ప్రశ్నించవచ్చో తెలుస్తుంది. ఐఐటీలు నిర్వహించే గేట్‌ పరీక్షా పత్రాలు ప్రాక్టీస్‌ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమేణా సబ్జెక్టుపై పట్టు పెంచుకుంటూ.. పరీక్షలో వచ్చే అవకాశమున్న ప్రశ్నలను విశ్లేషించుకునే నేర్పు అలవరచుకుంటే విజయం తథ్యం. ప్రతిరోజూ కనీసం ఒక గంట జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌కు కేటాయించాలి. ప్రతి ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లో కొన్ని సులభమైన, కొన్ని క్లిష్టమైన సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి మనిషికి ఒక విలక్షణమైన జీవన సరళి ఉంటుంది. కొన్నిసమయూల్లో Higher Energy Levels... మరికొన్ని సమయూల్లో Lower Energy Levels ఉంటాయి. కఠినమైన సబ్జెక్టులను Higher Energy Levels ఉండే సమయంలో చదవాలి. దాంతోపాటు ముఖ్యమైన టాపిక్స్‌ను స్నేహితులతో చర్చిస్తే చాలా మంచిది. సందేహాలుంటే.. సీనియర్లు, అధ్యాపకుల సలహా, సహకారాలు తీసుకోవాలి.

Photo Stories