Skip to main content

ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో చేరాలన్నది నా లక్ష్యం. ఈ కోర్సులో ఉత్తీర్ణులయ్యాక ఉద్యోగంలో భాగంగా ఎలాంటి విధులు ఉంటాయి. ఈ కోర్సుతో...

- కావ్య, గుంటూరు.
Question
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో చేరాలన్నది నా లక్ష్యం. ఈ కోర్సులో ఉత్తీర్ణులయ్యాక ఉద్యోగంలో భాగంగా ఎలాంటి విధులు ఉంటాయి. ఈ కోర్సుతో ఉన్నత విద్యావకాశాలు, కోర్సు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
ఏరోస్పేస్ ఇంజనీర్లు ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ల డిజైన్, డెవలప్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, టెస్టింగ్, రీసెర్చ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్.. ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌ల కలయిగా ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ భూ వాతావరణంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన అంశాల గురించి పేర్కొంటే.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ భూ వాతావరణానికి వెలుపల ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన విషయాలను వివరిస్తుంది.

అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఐఐటీలు జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తుంటే... ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు స్వీయ ప్రవేశ విధానాన్ని అమలుచేస్తున్నాయి.
గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సు: బీటెక్.. డ్యూయల్ డిగ్రీ (బ్యాచిలర్+మాస్టర్స్)
ఉన్నత విద్య :
ఎంటెక్ (స్పెషలైజేషన్ కోర్సులు), పీహెచ్‌డీ పోగ్రామ్స్.

ఇన్‌స్టిట్యూట్స్:
  1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఖరగ్‌పూర్.
  2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై.
  3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్.
  4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, షిబ్‌పూర్, పశ్చిమ బెంగాల్.

Photo Stories