Skip to main content

యూకేలో ఎంఎస్(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సుతో ఎలాంటి అవకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రికల్ విభాగంలో బెస్ట్...

-నరేంద్ర
Question
యూకేలో ఎంఎస్(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సుతో ఎలాంటి అవకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రికల్ విభాగంలో బెస్ట్ కోర్సులను సూచించండి?
యూకేలో ఎంఎస్ కోర్సుల్లో ఏ స్పెషలైజేషన్ అయినా.. 16 నెలల నుంచి రెండేళ్ల వ్యవధిలో ఉంటుంది. టాప్ యూనివర్సిటీల్లో మాత్రం రెండేళ్ల వ్యవధిలోనే కోర్సుల బోధన సాగుతుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌కి సంబంధించి దాదాపు నలభైకి పైగా స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో.. ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ లైటింగ్ సిస్టమ్స్, లైటింగ్ డిజైన్ స్పెషలైజేషన్స్‌కు మంచి పేరుంది. వీటితోపాటు ఇటీవల కాలంలో పవర్ జనరేషన్ అండ్ సప్లయ్, రోబోటిక్ సిస్టమ్స్ వంటి ఆధునిక స్పెషలైజేషన్స్‌ను కూడా యూనివర్సిటీలు అందిస్తున్నాయి. కెరీర్ అవకాశాల కోణంలో ఇప్పుడు యూకేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పీజీ ఉత్తీర్ణులకు డిమాండ్ నెలకొంది. ఈ విభాగంలో మానవ వనరుల డిమాండ్‌కు సరిపడే రీతిలో నైపుణ్యాలున్న అభ్యర్థులు లభించకపోవడమే ఇందుకు కారణం. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రధానంగా పవర్ జనరేషన్ సంస్థలు,ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో డిజైన్, డెవలప్‌మెంట్, రీసెర్చ్ విభాగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. యూకేలోని యూనివర్సిటీలు అందించే సర్టిఫికెట్లకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న కారణంగా ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, జపాన్ వంటి ఇతర దేశాల్లోనూ చక్కటి కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. వేతనాల పరంగా పీజీ స్థాయిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు వారికి లభించిన హోదా ఆధారంగా సగటున 75 వేల యూరోల వార్షిక వేతనం అందుతోంది. డిజైన్, రీసెర్చ్ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకున్న వారికి లక్ష యూరోల వరకు వేతనం అందే అవకాశం ఉంది. ఈ కోర్సులో చేరాలంటే.. జీఆర్‌ఈలో మంచి స్కోర్లు తప్పనిసరి. వెర్బల్ అండ్ క్వాంటిటేటివ్ విభాగాల్లో 150కుపైగా పర్సంటైల్ స్కోర్, అనలిటికల్ రైటింగ్‌లో నాలుగు పాయింట్ల వరకు స్కోర్ ఉంటే.. టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశం సులభంగా లభిస్తుంది. దీంతోపాటు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ వంటి లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్లు కూడా ఉండాలి.

Photo Stories