Skip to main content

జేఎన్‌టీయూ అనంతపూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. యాప్ డవలప్‌మెంట్‌లో కెరీర్ కోరుకుంటున్నాను. యాప్ డవలపర్‌గా మారేందుకు అవసరమైన...

-షరీఫ్
Question
జేఎన్‌టీయూ అనంతపూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. యాప్ డవలప్‌మెంట్‌లో కెరీర్ కోరుకుంటున్నాను. యాప్ డవలపర్‌గా మారేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం ఎలాగో తెలపండి?
ప్రస్తుతం చదివిన డొమైన్‌తో సంబంధం లేకుండా.. అన్ని రకాల కోర్సులు పూర్తిచేసిన వారికి చక్కటి ఉపాధి కల్పిస్తున్న విభాగం.. మొబైల్ యాప్ డెవలప్‌మెంట్. పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్స్ వినియోగం.. మొబైల్ గేమ్స్‌కు యువత ఆదరణతోపాటు.. యాప్ ఆధారిత సేవలవైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న నేపథ్యంలో యాప్ డెవలపర్స్‌కు మంచి డిమాండ్ నెలకొంది. దీనికి సంబంధించి ప్రత్యేక కోర్సులు, శిక్షణ ద్వారానే యాప్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలు సొంతమవుతాయి. ముఖ్యంగా యాప్ డెవలప్‌మెంట్ విభాగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటే.. సీ, సీ++, ఆబ్జెక్టివ్ సి వంటి కంప్యూటర్ లాంగ్వేజ్‌ల ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎంతో ముఖ్యం.
  • ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు యాప్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్ సైతం యాప్ డెవలప్‌మెంట్‌పై శిక్షణనిస్తున్నాయి. ఉడెమీ, ఎడ్యురేక, ఎడెక్స్ తదితర ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్స్‌లో సైతం ఆన్‌లైన్ విధానంలో మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా గూగుల్, ఒరాకిల్ సంస్థలు అందిస్తున్న సర్టిఫికేషన్ కోర్సులు కూడా పూర్తి చేయొచ్చు. వీటిని పూర్తి చేసుకుంటే మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
  • ఈ రంగంలో రాణించేందుకు.. సాంకేతిక నైపుణ్యాలతోపాటు క్రియేటివిటీ, అడాప్టబిలిటీ స్కిల్స్ కూడా ఉండాలి. అప్పుడే వినియోగదారుల అవసరాలు, మార్కెట్‌లో నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా యాప్స్‌ను డెవలప్ చేసే నైపుణ్యం లభిస్తుంది.
  • నైపుణ్యాలున్న అభ్యర్థులకు నెలకు రూ.18వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందుతోంది. స్వయం ఉపాధి కోణంలోనూ యాప్ డెవలపర్స్‌కు అవకాశాలు విస్తృతం. సొంతంగా యాప్‌ను డెవలప్ చేసే ముందు దానికి సంబంధించి మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగడం ఎంతో అవసరం. ఫ్రీలాన్సింగ్ విధానంలో పనిచేస్తూ ఆదాయం పొందే అవకాశం ఉంది.

Photo Stories