Skip to main content

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?

-రాధ, విజయవాడ
Question
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
ఫ్యాషన్ డిజైనింగ్.. చాలా విస్తృతమైన సబ్జెక్టు. ఇందులో గార్మెంట్ డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్ లాంటి వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది యువతకు మంచి ఉపాధి వేదికగా మారడంతో ఎక్కువమంది దీనివైపు ఆకర్షితులవుతున్నారు.
  • హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్‌లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇందులో టెక్స్‌టైల్ డిజైన్, ఆక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ అండ్ కమ్యూనికేషన్ లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థ అపారెల్ ప్రొడక్షన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. ఈ సంస్థ మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌ను కూడా అందిస్తోంది.
    వెబ్‌సైట్: www.nift.ac.in

  • హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో టెక్స్‌టైల్ డిజైనింగ్ ఒక సబ్జెక్టుగా ఆరు నెలల డిప్లొమా కోర్సును అందిస్తోంది.
    అర్హత: పదో తరగతి
    వెబ్‌సైట్: www.iiftindia.net

  • హైదరాబాద్‌లోని అపారెల్ ట్రెయినింగ్ అండ్ డిజైన్ సెంటర్.. ఒకేడాది అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీల్లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ఈ రెండు సబ్జెక్టుల్లో రెండేళ్ల అసోసియేట్ డిగ్రీలను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ సంస్థ అడ్వాన్స్‌డ్ ప్యాటర్న్ మేకింగ్‌లో డిప్లొమా కోర్సును అందిస్తోంది. ఇది వొకేషనల్ కోర్సులకు శిక్షణనిచ్చే సంస్థ.
    అర్హత: పదో తరగతి/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
    వెబ్‌సైట్: www.atdcindia.co.in

Photo Stories