Skip to main content

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) అందిస్తున్న బ్యాచిలర్ కోర్సుల వివరాలు తెలియజేయండి?

- ఎం.మేఘన, హైదరాబాద్.
Question
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) అందిస్తున్న బ్యాచిలర్ కోర్సుల వివరాలు తెలియజేయండి?
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (వ్యవధి నాలుగేళ్లు): ఇది ఎన్‌ఐడీ అహ్మదాబాద్ క్యాంపస్‌లో అందుబాటులో ఉంది.
స్పెషలైజేషన్లు-సీట్లు: యానిమేషన్ ఫిల్మ్ డిజైన్ (15); ఎగ్జిబిషన్ డిజైన్ (10); ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ (10); గ్రాఫిక్ డిజైన్ (15); సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్ (10); ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ (10); ప్రొడక్ట్ డిజైన్ (15); టెక్స్‌టైల్ డిజైన్ (15).
గాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (జీడీపీడీ): ఈ కోర్సు ఎన్‌ఐడీ-కురుక్షేత్ర, ఎన్‌ఐడీ-విజయవాడ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉంది. కాల వ్యవధి నాలుగేళ్లు. కోర్సులో ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్; టెక్స్‌టైల్ అండ్ అపెరల్ డిజైన్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
సైన్స్/కామర్స్/ఆర్ట్స్/ఏదైనా విభాగంలో హయ్యర్ సెకండరీ (10+2) అర్హతతో కోర్సులో ప్రవేశించొచ్చు. డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ)లో చూపిన ప్రతిభ ఆధారంగా కోర్సుకు అర్హులను ఎంపిక చేస్తారు.
డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ): పరీక్ష రెండు దశల్లో ప్రిలిమ్స్, మెయిన్స్‌గా జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని, విశ్లేషణ సామర్థ్యాన్ని, ఊహా శక్తిని, సృజనాత్మకతను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. పరీక్ష 100 పాయింట్లకు జరుగుతుంది. మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
పిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. ఇందులో డ్రాయింగ్/స్కెచింగ్, మోడల్ మేకింగ్‌కు సంబంధించి ప్రశ్నలుంటాయి. ఈ దశకు 100 మార్కులు కేటాయించారు. మూడు గంటల వ్యవధిలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.nid.edu

Photo Stories