Skip to main content

నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. కోర్సు తీరు, ఉన్నత విద్యావకాశాలు, కోర్సు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలియజేయండి?

- రాజు, హైదరాబాద్.
Question
నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. కోర్సు తీరు, ఉన్నత విద్యావకాశాలు, కోర్సు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలియజేయండి?
పౌర, రక్షణ అవసరాలకు ఉపయోగించే ఎయిర్‌క్రాఫ్టుల డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ తదితరాలను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా విద్యార్థులు నేర్చుకుంటారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఫిజిక్స్, మ్యాథ్స్‌లను అడ్వాన్స్‌డ్ స్థాయిలో అధ్యయనం చేస్తారు.

అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2 ఉత్తీర్ణత.
గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు: బీటెక్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్/బీఈ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్.
ఉన్నత విద్య: ఎంటెక్/ఎంఈ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్.
  • ఎంటెక్/ఎంఈ ఇన్ ఏవియానిక్స్.

ఇన్‌స్టిట్యూట్‌లు:
  1. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, హైదరాబాద్.
  2. మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్.
  3. హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, చెన్నై.
  4. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, బెంగళూరు.
  5. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై.
  6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫర్మేషన్, టెక్నాలజీ(ఐఐఏఈఐటీ), పుణె.
  7. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్(సీఐఐఏఈ), డెహ్రాడూన్.
  8. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఏరోనాటికల్ టెక్నాలజీ, లక్నో.

Photo Stories