TS DEECET 2023: డీఈఈసెట్–2023 ప్రవేశాలషెడ్యూల్ విడుదల
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ రెండేళ్ల కోర్సుల్లో మొదటి సంత్సరం ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్–2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 20వ తేదీ నుంచి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ డిసెంబర్ 18న ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: NCTE: టీచర్లకు గుదిబండలా ‘TET’.. ఈ నిబంధనతో అయోమయం
డిసెంబర్ 20న ధ్రువపత్రాల పరిశీలన(ఇదివరకు పరిశీలనకు హాజరుకానివారు మాత్రమే) జరగనుంది. డిసెంబర్ 22 నుంచి 27వ తేదీ వరకు కళాశాలల వారీగా అభ్యర్థులు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. డిసెంబర్ 30న సీట్ల కేటాయింపు ఉంటుంది.
2024 జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు తుది ప్రవేశాల ప్రతుల డౌన్‌లోడింగ్, ఫీజు చెల్లింపుల ప్రక్రియ జరుగుతుందని, 5వ తేదీన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని, 8వ తేదీన ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కన్వీనర్ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు డీఈఈసెట్–2023 వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.