Skip to main content

TS CPGET 2024 Notification: సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. రిజిస్ట్రేషన్‌కు చివ‌రి తేది ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో (పీజీ) ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్‌ పోస్టు–గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–సీపీగెట్‌–2024) నోటిఫికేషన్‌ విడుదలైంది.
TS CPGET 2024 Notification

మే 15న‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు యూనివర్సిటీల పరిధిలో 294 పీజీ కాలేజీలున్నాయి. వీటిల్లో పీజీ కోర్సులతో పాటు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీకి సంబంధించిన 54 కోర్సులున్నాయి. వీటిల్లో 47,211 పోస్టు గ్రాడ్యుయేట్‌ సీట్లున్నాయి. వీటిని సీపీగెట్‌ ద్వారా భర్తీ చేస్తారు.

సీపీగెట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 18 నుంచి మొదలవుతుంది. జూలై 5 నుంచి కంప్యూటర్‌ బేస్డ్‌ మోడ్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్‌ ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మçహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్, తెలంగాణ మహిళా వర్సిటీల్లో పీజీ కోర్సుల్లోని సీట్లను భర్తీచేస్తారు. ఏటా పీజీ కాలేజీల్లో సగానికిపైగా సీట్లు భర్తీ కావడం లేదు. గతేడాది కేవలం 43.46 శాతం సీట్లు మాత్రమే నిండినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

చదవండి: New PG Course: ‘నన్నయ’లో పీజీ కొత్త కోర్సు ప్రారంభం

రాష్ట్రంలో మొత్తంగా 47,211 సీట్లుంటే నిరుడు కేవలం 20,519 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 73 శాతం మహిళలే పీజీ కోర్సుల్లో చేరారు. మహిళలు 15,107 మంది చేరగా, పురుషులు 5,412 మంది మాత్రమే పీజీ కోర్సుల్లో చేరారు. ఈ సారి 10 శాతం సీట్లు నిండని కాలేజీలను బ్లాక్‌ చేసే ఆలోచనలో అధికారులున్నారు.

ఈ ఏడాది విద్యార్థుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉండే అవకాశాలున్నాయి. దరఖాస్తులు సహా పూర్తి వివరాల కోసం  www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, వైస్‌చైర్మన్‌ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, పలు వర్సిటీల వీసీలు రవీందర్, గోపాల్‌రెడ్డి, మల్లేశ్, విద్యుల్లత, సీపీగెట్‌ కన్వీనర్‌ పాండురంగారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీపీగెట్‌

షెడ్యూల్‌

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

18–05–24

రిజిస్ట్రేషన్‌కు తుది గడువు

17–06–24

రూ.500 ఆలస్య రుసుముతో గడువు

25–06–24

రూ.2 వేల ఆలస్య రుసుముతో గడువు

30–06–24

ప్రవేశ పరీక్షలు

5–07–24

Published date : 16 May 2024 11:22AM

Photo Stories