Skip to main content

CAT 2021: క్యాట్ ఫలితాల్లో సూపర్ నైన్.. ఫలితాల కోసం క్లిక్ చైయండి..

ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఐఐఎం అహ్మదాబాద్‌ నేతృత్వంలో జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (క్యాట్‌) ఫలితాలను జనవరి 3న సాయంత్రం ప్రకటించారు.
CAT
క్యాట్‌ ఫలితాల్లో సూపర్‌ నైన్

ఇందులో తొమ్మిది మందికి నూటికి నూరు మార్కులు (100 పర్సంటేల్‌) వచ్చాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, పశ్చిమబెంగాల్, తెలంగాణకు చెందిన విద్యార్థులున్నారు. అభ్యర్థులు ఎవరన్నది మాత్రం అహ్మదాబాద్‌ ఐఐఎం పేర్కొనలేదు. గత సంవత్సరంలో జరిగిన క్యాట్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.92 లక్షల మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 156 పట్టణాల్లో 438 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. పరీక్షలో పాసయిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వూ్య నిర్వహిస్తారు. ఆ తర్వాత సీట్లు కేటాయిస్తారు. 

>> ఫలితాల కోసం క్లిక్ చైయండి

Published date : 04 Jan 2022 04:33PM

Photo Stories