Skip to main content

ANU: పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పలు పీజీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లకు ఏప్రిల్‌ 12, 13 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని అడ్మిషన్ల డైరెక్టర్‌ డాక్టర్‌ హరిబాబు తెలిపారు.
Spot admissions for PG courses
పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

ఏపీపీజీసెట్‌–2021 ర్యాంకు ఉన్న అభ్యర్థులకు, పీజీసెట్‌ ర్యాంకు లేని అభ్యర్థులకు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. ఏపీపీజీసెట్‌–2021 ర్యాంకు ఉన్న వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఏపీపీజీసెట్‌–2021 ర్యాంకు లేకుండా స్పాట్‌ అడ్మిషన్లకు హాజరైన అభ్యర్థుల అడ్మిషన్లు ఏప్రిల్‌ 16వ తేదీన పూర్తి చేస్తామన్నారు. ర్యాంకు లేకుండా స్పాట్‌ అడ్మిషన్ కు హాజరయ్యే అభ్యర్థులు ఏప్రిల్‌ 16వ తేదీలోపు జరిగే ఏఎన్ యూ ప్రవేశ పరీక్షకు తప్పకుండా హాజరవ్వాలని సూచించారు.

Sakshi Education Mobile App
Published date : 12 Apr 2022 01:06PM

Photo Stories