Skip to main content

TSWREIS: ఎస్సీ గురుకుల సీవోఈ కాలేజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 38 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ(సీవోఈ) జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల అర్హత పరీక్ష ఫలితాలు మే 6న విడుదలయ్యాయి.
SC Gurukul COE College Entrance Exam Results Released
ఎస్సీ గురుకుల సీవోఈ కాలేజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌ తెలిపారు. ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులు సంబంధిత సీవోఈ కాలేజీలో మే 16 వరకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరు కావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతోపాటు పాఠశాల విద్య బోనఫైడ్‌లను కూడా ఆయా కాలేజీలో ప్రిన్సిపాళ్లకు సమరి్పంచాల్సి ఉంటుందన్నారు. వొకేషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు మాత్రం టెన్ ్త పరీక్ష ఫలితాలు వచి్చన తర్వాత విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 

Sakshi Education Mobile App
Published date : 07 May 2022 03:07PM

Photo Stories