PGCET: పీజీసెట్–2021 షెడ్యూల్ విడుదల
సెప్టెంబర్ 15న వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో ఆమె ఏపీ పీజీసెట్–2021 కన్వీనర్ ఆచార్య వై.నజీర్‌అహ్మద్, రిజిస్ట్రార్ ఆచార్య డి.విజయరాఘవప్రసాద్‌తో కలిసి ప్రవేశాల షెడ్యూల్ నోటిఫికేషన్ ను ప్రకటించారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, మా స్టర్ ఆఫ్ లైబ్రరీ సై¯Œ్స, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎం ఎస్సీ (టెక్) కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు, పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు అర్హులు. ఆన్ లైన్ దరఖా స్తుల స్వీకరణకు చివరి గడువు ఈనెల 30వ తేదీగా నిర్ణయించారు. రూ.200 ఆలస్య రుసుంతో అక్టోబర్ 4 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్ 8 వరకు గడువు ఉంది. ప్రవేశ పరీక్ష అక్టోబర్ 22 న జరుగుతుంది. ఒక్కో సబ్జెక్టుకు దరఖాస్తు రుసుం ఓసీ అభ్యర్థులకు రూ.850, బీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.650 చొప్పున నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. పూర్తి వివరాలకు www.yogivemanauniversity.ac.in లేదా www.yvu.edu.in వెబ్‌సైట్‌లలో సంప్రదించాలి.