Skip to main content

Navodaya Entrance Test 2024: పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి... ఇంకా ఇవి తప్పనిసరి!

జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ఈనెల 20న నిర్వహించనున్నారు.
Jawahar Navodaya Vidyalaya Class 6 Admission Test  Navodaya Entrance Test Instructions    JNV Entrance Test 2024-25   Entrance Test for Jawahar Navodaya Vidyalaya Class 6 Admission

ప్రవేశ పరీక్ష ఉదయం 11.30 నుంచి 1.30 వరకు నిర్వహిస్తామని, పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కోసం 8430 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయంలో తమ ఆధార్‌కార్డు/ రెసిడెన్స్‌ ధ్రువీకరణ పత్రం, అట్ట, బ్లూ లేదా బ్లాక్‌పెన్‌తో హాజరు కావాలని సూచించారు.

మూడు విభాగాల్లో పరీక్ష
ప్రవేశ పరీక్ష వంద మార్కులకు 80 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు విభాగాల్లో ఈ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది. రీజనింగ్‌ మేథాశక్తిలో 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితంలో 25 మార్కులకు 20 ప్రశ్నలు, తెలుగు లేదా ఇంగ్లిష్‌లో ఐదు ప్యాసేజ్‌లు ఉంటాయి. ఒక్కో ప్యాసేజ్‌కు నాలుగు ప్రశ్నల చొప్పున ఉంటాయి. వీటికి 25 మార్కులు ఉంటాయి. మేధాశక్తి విభాగంలో 50 మార్కులు ఉంటాయి.

చదవండి: Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

విద్యార్థులకు సూచనలు

  • అడ్మిట్‌ కార్డు లేకుండా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు.
  • అడ్మిట్‌ కార్డులోని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలి.
  • పరీక్షా హాల్‌లో సాధారణ చేతి గడియారం మినహా ఎలక్ట్రానిక్‌ పరికరాలు/గాడ్జెట్‌లు అనుమతించబడవు.
  • పరీక్షా హాల్‌లోకి అడ్మిట్‌ కార్డు, బ్లాక్‌/బ్లూ పెన్నులు మినహా ఏ వస్తువులను తీసుకెళ్లరాదు.
  • బ్లాక్‌, నీలం రంగు పెన్నులతో మాత్రమే సమాధానాలు రాయాలి.
  • పెన్సిల్‌ను ఉపయోగించరాదు.
  • అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న అదే పరీక్షా మాధ్యమం ప్రశ్నాపత్రాన్ని అందిస్తారు.
  • అభ్యర్థులు ఓఎంఆర్‌ షీటుతో పాటు ప్రశ్నపత్రంపై హాల్‌ టిక్కెట్‌ నంబరు వేయాలి.
  • టెస్ట్‌ బుక్‌లెట్‌పై ముద్రించిన టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌, సీరీస్‌, సమాధాన పత్రం సైడ్‌–2పైన ఉన్న టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌, టెస్ట్‌ బుక్‌లెట్‌ సీరీస్‌ ఒకే విధంగా ఉన్నదో లేదో సరిచూసుకోవాలి.
  • ప్రశ్నకు సంబంధించిన బాక్స్‌లో సమాధానాన్ని పెన్నుతో బబ్లింగ్‌ చేయాలి.
  • వైట్‌ ఫ్లూయిడ్‌ గాని కరెక్షన్‌ ఫ్లూయిడ్‌లను ఉపయోగించకూడదు.
  • ఓఎంఆర్‌ షీటుపై దిద్దుట, కొట్టివేయుట, తుడుపుట వంటివి చేయకూడదు. ఏ రకమైన గీతలు, గుర్తులు పెట్టొద్దు.
  • రఫ్‌ వర్క్‌కు సమాధాన పత్రం ఉపయోగించకూడదు.
  • అభ్యర్థులు 1.30 గంటకు ముందు హాల్‌ నుంచి బయటకు వెళ్లటానికి వీలు లేదు.
Published date : 20 Jan 2024 10:20AM

Photo Stories