Skip to main content

8 నుంచి హాల్‌టికెట్ల జారీ

ఆగస్టు 11 నుంచి ప్రారంభంకానున్న వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు TS CPGET–2022 కన్వీనర్‌ పాండురంగారెడ్డి ఆగస్టు 1న తెలిపారు.
Issuance of TSCPGET 2022 hall tickets
8 నుంచి సీపీగేట్– 2022 హాల్‌టికెట్ల జారీ

ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 8 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసు కోవాలన్నారు. ఓయూ నిర్వహించే CPGET– 2022లో 45 సబ్జెక్టులకు 67,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులను గంట ముందు పరీక్ష కేంద్రానికి అనుమతించనున్నట్లు చెప్పారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఓయూతో పాటు తెలంగాణ, తెలంగాణ మహిళ, కాకతీయ, పాలమూరు, శాతా వాహన, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సి టీల్లో పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సు ల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు కన్వీనర్‌ పేర్కొన్నారు. పీజీ కౌన్సెలింగ్‌ సమయంలో 2022లో ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు.

చదవండి: 

 

Published date : 03 Aug 2022 11:40AM

Photo Stories