గురుకుల ప్రవేశ పరీక్షకు 90.91% హాజరు
Sakshi Education
సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో చేరికకు మే 8న నిర్వహించిన వీటీజీసెట్–22 ప్రశాంతంగా ముగిసింది.
415 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,34,478 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఆర్‌ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)ల పరిధిలోని 603 గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతికి 48,120 సీట్లున్నాయి. ఈ సీట్లలో ప్రవేశాల కోసం 1,47,924మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,34,478 మంది పరీక్ష రాశారు. 90.91శాతం విద్యార్థులు హాజరుకావడంతో అడ్మిషన్ల కోసం ఒక్కో సీటుకు సగటున ముగ్గురు పోటీ పడుతున్నారు. అతి త్వరలో వీటీజీసెట్–2022 పరీక్ష ఫలితాలు ప్రకటించనున్నారు.
Published date : 09 May 2022 01:04PM