CJI: కామన్ ఎంట్రన్స్‌తో నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చు
Sakshi Education
పణాజి: నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సీఎల్‌ఏటీ) ద్వారా సరైన నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
ఎల్లప్పుడూ పరీక్షల్లో ఉత్తీర్ణతకే తప్ప, విలువ ఆధారిత విద్యను ప్రోత్సహించకపోవడమే ఇందుకు కారణం కావచ్చని ఆయన చెప్పారు.
చదవండి: Supreme Court: సుప్రీంకోర్టులో మరోసారి మహిళా ధర్మాసనం
డిసెంబర్ 3న ఆయన గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి విద్యా సంవత్సరం సెషన్‌ను ప్రారంభించి మాట్లాడారు.
Published date : 05 Dec 2022 03:20PM