INI-CET: ప్రతిభ చాటిన జిల్లా వాసులు
ఎండీ ప్రవేశాలకు సంబంధించిన నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఫలితాల్లో తాడిపత్రి పట్టణానికి చెందిన శివజ్యోతిక (రోల్ నెంబర్ – 7318265) 99.749 శాతం మార్కులతో జాతీయ స్థాయిలో 145 ర్యాంకును సొంతం చేసుకుంది. శివజ్యోతిక తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. తండ్రి రామాంజనేయులు తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాలలో, తల్లి పద్మావతమ్మ వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం దత్తాపురం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. అలాగే గుత్తికి చెందిన సత్యనారాయణ, పద్మలత దంపతుల కుమార్తె స్వప్నశ్రీ.. జాతీయ స్థాయిలో 263వ ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం ఆమె ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుతోంది.
చదవండి:
1.6 Crore Package: 1.6 కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన ఎన్ఐటీ అమ్మాయి
2 crore job offer from Uber: సాధారణ రైతు బిడ్డ... రూ.2 కోట్ల ప్యాకేజీతో అదరగొట్టాడు
2 crore salary package: రెండు కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన హైదరాబాదీ అమ్మాయి