Skip to main content

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష వాయిదా

గుంటూరు మిర్చియార్డులో అక్టోబర్‌ 31న జరగాల్సిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ రాత పరీక్ష వాయిదా వేసినట్లు స్టెప్‌ సీఈవో డాక్టర్‌ వి. శ్రీనివాసరావు అక్టోబర్‌ 18న ఓ ప్రకటనలో తెలిపారు.
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష వాయిదా
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష వాయిదా

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో వివిధ కేటగిరీలలో శారీరక పరీక్షల్లో అర్హత సాధించినవారికి పరీక్ష నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తిరిగి పరీక్ష తేదీ, కేంద్రం వివరాలను తెలియజేస్తామని పేర్కొన్నారు.

చదవండి:

Degree: నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం డిగ్రీ కోర్సుల్లో మార్పులు

జనరల్‌ మెడిసిన్ వైపు చూపు

Published date : 19 Oct 2021 12:03PM

Photo Stories