Applications For MBA Admissions: ఎంబీఏలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం, అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే..
Sakshi Education
బీచ్ రోడ్డు: నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ(లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే..
గురువారం నుంచి జూన్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 60 సీట్ల భర్తీకి సంబంధించి డిఫెన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.40 వేలు ఫీజు, ఇతరులకు రూ.60 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు 1200 కాగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.1000గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు మరిన్ని వివరాల కోసం ఏయూ వెబ్‌సైట్ www.audoa.in సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 18 Apr 2024 05:28PM