డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే Engineering Common Entrance Test – 22కు రాష్ట్ర వ్యాప్తంగా 38,650 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఏపీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.కృష్ణమోహన్ జూన్ 24న కాకినాడలో తెలిపారు.
ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు–22 తెలంగాణలో కూడా
రూ.5,000 ఆలస్య రుసుముతో జూలై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని, హాల్‌టికెట్లు జూలై 15 నుండి జారీ చేస్తామని చెప్పారు. పరీక్ష జూలై 22వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఏపీతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షను ఈ ఏడాది JNTU కాకినాడ యూనివర్సిటీ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు సందేహాల నివృత్తికై 0884–2340535 నంబరును సంప్రదించవచ్చని సూచించారు.