AP PGCET-2022: నోటిఫికేషన్ జారీ.. చివరి తేదీ ఇదే..
జూన్ 22న కడపలోని Yogi Vemana Universityలో AP PGCET చైర్మన్, వైవీయూ వైస్ చాన్సలర్ మునగల సూర్యకళావతి, సెట్ కన్వీనర్ వై.నజీర్ అహ్మద్ పీజీ సెట్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం AP PGCET-2022 నిర్వహణ బాధ్యత ను Yogi Vemana Universityకి రెండోసారి అప్పగించిందన్నారు. ఒక సబ్జెక్టుకు ఒక దరఖాస్తు, ఒకే ఫీజుతో ఆ సబ్జెక్టు పరిధిలో ఉన్న అన్ని కోర్సులకు అభ్యర్థులు అర్హులవుతారన్నారు. సెట్ కన్వీనర్ నజీర్ అ హ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 16 వర్సిటీలు , అనుబంధ పీజీ కళాశాలలు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్, మైనార్టీ కళాశాలల్లో ఉన్న 145 కోర్సులకు ఒకే Notification ద్వారా సీట్లు భర్తీ అవుతాయన్నారు. 2022–23 విద్యా సంవత్సరానికి పీజీ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో వారి ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు పొందవచ్చన్నారు.
చదవండి:
మూడు కేటగిరీలుగా..
AP PGCETను మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ–1లో ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషియల్ సైన్స్, కేటగిరీ–2లో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్, కేటగిరీ–3లో సైన్స్ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఎంఏ, ఎంకాం, ఎంస్సీ, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ (టెక్) తదితర పీజీ కోర్సులున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు జూలై 20వ తేదీగా నిర్ణయించారు. రూ.500 ఆలస్య రుసుంతో జూలై 27వ తేదీ వరకు, రూ.1,000 ఆలస్య రుసుంతో జూలై 29వ తేదీ వరకు గడువు ఉంటుంది. దరఖాస్తు రుసుం ఓసీ అభ్యర్థులు రూ.850, బీసీ అభ్యర్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షలు ఆగస్టు 17వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తారు. తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తు, వివరాలకు కోసం yvu.edu.in లేదా cets.apsche.ap.gov.inలో సందర్శించాలి. దరఖాస్తు రుసుం ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో కానీ, డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ విధానంలో గానీ చెల్లించవచ్చు.