AP KGBV Admissions Online Date Extended: ఏపీ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ మేరకు ఏప్రిల్ 20వ తేదీ వరకు గడువు పెంచుతున్నట్లు సమగ్రశిక్షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్పీడీ) శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటివరకు 11వ తరగతిలో ప్రవేశాలు పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 29,621 దరఖాస్తులు అందాయని,ఆరో తరగతిలో ప్రవేశాలకు 45,621 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను గడువులోగా సమర్పించాలని తెలిపారు.
అనాథ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసినవారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. సందేహాలు ఉంటే 18004258599 ఫోన్ నంబరు ద్వారా సంప్రదించాలని ఆయన సూచించారు.
Tags
- KGBV
- AP KGBV
- KGBV Admissions
- AP KGBV Admissions 2024
- online applications
- Online application
- Academic year
- Online application form
- Andhra Pradesh
- Kasturba Gandhi Girls' Vidyalaya
- Kasturba Gandhi Girls High School
- Inter Admissions
- application deadline
- Kasturba Gandhi Girls Vidyalaya
- inter first year admissions at KGBV
- Academic year 2024-25
- sakshieducation admissions