TS CETs 2023: సెట్లు తేదీలను ప్రకటించిన మంత్రి సబిత.. షెడ్యూల్ ఇదే..
ఇంజనీరింగ్ ఎంసెట్‌ను మే 7 నుంచి 11 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. 2023లో కూడా ఎంసెట్‌ను జేఎన్‌టీయూహెచ్ నిర్వహిస్తోంది. ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫిబ్రవరి 7న తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెట్స్‌కు సంబంధించిన దరఖాస్తు తేదీలు, ఫీజుల వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌లను సంబంధిత సెట్ల కన్వీనర్లు త్వరలో విడుదల చేస్తారని మంత్రి తెలిపారు.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
రాష్ట్రంలో నిర్వహించే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదీ..
సెట్ |
నిర్వహించే యూనివర్సిటీ |
పరీక్ష తేదీ |
జేఎన్‌టీయూహెచ్ |
7.5.23–11.5.23 |
|
జేఎన్‌టీయూహెచ్ |
12.5.23–14.5.23 |
|
మహాత్మాగాంధీ |
18.5.23 |
|
ఉస్మానియా |
20.5.23 |
|
ఉస్మానియా |
25.5.23 |
|
టీఎస్ పీజీ సెట్ |
ఉస్మానియా |
25.5.23 |
కాకతీయ |
26, 27.5.23 |
|
టీఎస్ పీజీఈసెట్ |
జేఎన్‌టీయూహెచ్ |
29.5.23 |