Skip to main content

CIPET: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్ష తేదీ ఇదే..

సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌) అందించే డిప్లొమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విజయవాడ సిపెట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ సీహెచ్‌ శేఖర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Admissions to CIPET Diploma Courses
సిపెట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు..

సంస్థ నుంచి మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ(డీపీటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ(డీపీఎంటీ) కోర్సులకు పదో తరగతి విద్యార్హత ఉండాలని, ఇటీవల పరీక్షలు రాసినవారు సైతం అర్హులని పేర్కొన్నారు. రెండేళ్ల కాల పరిమితి గల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌(పీజీడీ–పీపీటీ) కోర్సుకు బీఎస్సీ పాస్‌ లేదా చివరి సంవత్సరం చదువుతున్న వారు www.cipet.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులు, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ ఐదో తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, వీరికి జూన్ 19న ఆన్ లైన్ లో సిపెట్‌ అడ్మిషన్ టెస్ట్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయంతో పాటు, హాస్టల్‌ సదుపాయం ఉంటుందని తెలిపారు. విజయవంతంగా కోర్సులు పూర్తి చేసినవారికి క్యాంపస్‌ ఎంపికల ద్వారా దేశ, విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివరించారు. వివరాలకు 99859 41979 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Sakshi Education Mobile App
Published date : 24 May 2022 12:53PM

Photo Stories