Skip to main content

TG CPGET Counselling Schedule: పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.57 శాతం పాస్‌.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్‌ కాలేజీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగేట్‌) ఫలితాలను ఆగ‌స్టు 9న‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి విడుదల చేశారు.
Counseling schedule for CPGATE released on August 9  CPGATE result announcement event  Counseling schedule for CPGATE qualifiers  95 percent pass in PG Common Entrance Test  Professor R Limbadri announcing the CPGATE results  SET Convenor Panduranga Reddy discussing counseling schedule  SET Convenor Panduranga Reddy discussing counseling schedule

సెట్‌లో 94.57 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 45 కోర్సులకు సంబంధించిన ఈ సెట్‌ను జులై 6 నుంచి 16వ తేదీ వరకూ నిర్వహించారు. 73,342 మంది పరీక్షకు దరఖాస్తు చేస్తే, 64,765 మంది పరీక్షకు హాజరయ్యారు.

వీరిలో 61,246 మంది (94.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పీజీ సెట్‌ పరీక్ష రాసిన వారు, అర్హత సాధించిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. బాలురు 21,757 మంది పరీక్ష రాస్తే, 20,569 మంది పాసయ్యారు. బాలికలు 43,008 మంది రాస్తే 40,677 మంది పాసయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ మహమూద్, ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్, సెట్‌ కన్వీనర్‌ పాండు రంగారెడ్డి పాల్గొన్నారు. 

చదవండి: CPGET - 2024 Results Click Here

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

తేదీ

వివరాలు

12.8.24 నుంచి 21.8.24

రిజిస్ట్రేషన్, ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

26.8.24

డేటా కరెక్షన్

27.8.24 నుంచి 30.8.24

వెబ్ ఆప్షన్లు

4.9.24

 సీట్ల కేటాయింపు

9.9.24

సీట్లు వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్

15.9.24

రెండో దశ కౌన్సెలింగ్ మొదలు

కొన్ని ప్రధాన బ్రాంచీల్లో టాపర్స్ వివరాలు

బ్రాంచీ

టాపర్

మార్కులు

జిల్లా

ఎంఏ ఎకనామిక్స్

తూడూరి సుమంత్

86

జగిత్యాల

ఎంఏ హిస్టరీ

బుస్సా రమ్య

76

సూర్యాపేట

ఎంఈడీ

కర్నాటి కావ్య

65

నల్లగొండ

ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్

బండి ప్రణీత

71

నల్లగొండ

ఎంకాం

కొండా తేజసాయి

78

హనుమకొండ

12 నుంచి కౌన్సెలింగ్‌: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఆగ‌స్టు 12 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు సెట్‌ కన్వీనర్‌ పాండురంగారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్‌ కోసం అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. కాలేజీల్లో చేరేటప్పుడు మాత్రమే ఒరిజినల్‌ సరి్టఫికెట్లు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 42,192 పీజీ సీట్లున్నాయని, ఈ సంవత్సరం మరో 2 వేల సీట్లు అదనంగా వచ్చే వీలుందని తెలిపారు. 278 కాలేజీలు కౌన్సెలింగ్‌ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు.

Published date : 10 Aug 2024 01:20PM

Photo Stories