RGUKT: ట్రిపుల్ ఐటీల్లో ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల తేదీ ఇదే
Sakshi Education
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2023–24 విద్యాసంవత్సరం ప్రవేశాలకు జూలై 5 నుంచి నిర్వహిస్తోన్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జూలై 9న ముగిసింది.
క్రీడా, ఎన్‌సీసీ, దివ్యాంగులు, సైనికోద్యోగులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీల్లో అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేశారు. స్పోర్ట్స్ కేటగిరీ కింద 635 మంది, ఎన్‌సీసీ అభ్యర్థులు 884 మంది, దివ్యాంగ అభ్యర్థులు 204 మంది, సైనికోద్యోగుల పిల్లలు కోటా అభ్యర్థులు 190 మంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్యర్థులు 165 మంది హాజరైనట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య గోపాలరాజు చెప్పారు. జూలై 13న ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామన్నారు.
చదవండి:
State Skill Development and Training Department: పాలిటెక్నిక్ సిలబస్‌ను ఏటా అప్‌గ్రేడ్ చేయాలి
Department of Technical Education: మరింత మెరుగ్గా సాంకేతిక విద్యాశాఖ వెబ్‌సైట్
Published date : 10 Jul 2023 04:21PM