Skip to main content

Ministry of Education: ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ టాప్‌–10 ఐఐటీలు ఇవే..

న్యూఢిల్లీ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) 8వ ఎడిషన్‌ను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది.
Ministry of Education
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ టాప్‌–10 ఐఐటీలు ఇవే..

టాప్‌–10లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) హైదరాబాద్‌కు చోటు దక్కింది. 2016–2022 కాలంలో ఏడు వార్షిక ర్యాంకుల ఆధారంగా 2023 సంవత్సరానికి గాను ఆయా కాలేజీలకు ర్యాంకులు నిర్ణయించినట్లు తెలిపింది. ఏటా మాదిరిగానే ఈసారి కూడా అడ్మిషన్‌ సీజన్‌కు కొద్ది వారాలు ముందుగా వీటిని ప్రకటించింది.

పరిశోధన సంస్థలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, డెంటల్‌ మరియు ఆర్కిటెక్చర్‌ ప్లానింగ్‌ అంశాల్లో ర్యాంకులు, టీచింగ్‌ లెర్నింగ్‌ తదితర అంశాల పరిగణనలోకి తీసుకుంటూ టాప్‌–50 కాలేజీలకు ర్యాంకులిచ్చింది. 

చదవండి: IIT Madras: పీఎస్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సు.. దేశంలోనే తొలిసారిగా..

తొలి పది ఇవే...

  1. ఐఐటీ మద్రాస్‌ 
  2. ఐఐటీ ఢిల్లీ 
  3. ఐఐటీ బాంబే
  4. ఐఐటీ కాన్పూర్‌
  5. ఐఐటీ రూర్కీ 
  6. ఐఐటీ ఖరగ్‌పూర్‌
  7. ఐఐటీ గువాహటి 
  8. ఐఐటీ హైదరాబాద్‌
  9. ఐఐటీ తిరుచిరాపల్లి
  10. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ 
Published date : 04 Jul 2023 03:04PM

Photo Stories