Good News: పాత ఫీజులే కొనసాగించాలని టీఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదన.. మంత్రి ఆమోదం
![Good News](/sites/default/files/images/2025/01/15/tslogo-1736911438.jpg)
ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే వీలుంది. ఈ సంవత్సరం పాత ఫీజులే కొనసాగిస్తూ Admission and Fee Regulatory Committee, Telangana (TAFRC) ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. దీన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదించారు. ఈ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వీలుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. 2022–23 నుంచి కొత్త ఫీజులు అమలు కావాల్సి ఉంది. దీనిపై ఎఫ్‌ఆర్‌సీ కసరత్తు చేసింది. కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించడంతోపాటు యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది. రూ. 35 వేలున్న కనిష్ట ఫీజును రూ. 45 వేలకు, రూ. 1.43 లక్షలున్న గరిష్ట ఫీజును రూ. 1.73 లక్షలకు పెంచాలని భావించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది.
చదవండి: