Data Science: డేటా సైన్స్ నిపుణులకు తీవ్ర కొరత
57 శాతం మంది ప్రారంభస్థాయి నిపుణుల విషయంలో అంతరం ఉందని చెప్పగా.. 27 శాతం మంది మేనేజర్లు మధ్యస్థాయి ఉద్యోగాలైన టీమ్లీడ్ (బృంద నాయకులు), ప్రాజెక్ట్ మేనేజర్ నిపుణుల విషయంలో కొరత ఉన్నట్టు తెలిపారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ ఎల్పీ) నైపుణ్యాలకు కొరత ఉందని 15 శాతం మంది హైరింగ్ మేనేజర్లు తెలిపారు. ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుల కొరత ఉందని 12 శాతం మంది మేనేజర్లు చెప్పారు. ఆ తర్వాత ఆటోమేషన్, కంప్యూటర్ విజన్, అనలైటిక్స్ నిపుణుల సరఫరా తగినంత లేదని మేనేజర్లు పేర్కొన్నారు. 100కు పైగా కంపెనీలకు చెందిన హెచ్ఆర్ మేనేజర్ల అభిప్రాయాలను ఈ అధ్యనంలో భాగంగా గ్రేట్ లెర్నింగ్ తెలుసుకుంది. ‘‘ప్రతీ పరిశ్రమ డిజిటల్ దిశగా మారిపోతోంది. డేటా సైన్స్ కార్యకలాపాల్లో భాగమైన ఎన్ ఎల్పీ, ఏఐఎంఎల్, బిగ్డేటా, ఆటోమేషన్ కు డిమాండ్ అధిక స్థాయిల్లో ఉంది. ఈ నూతన అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా మన విద్యా ప్రమాణాలను మెరుగుపరచుకోవడంతోపాటు.. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది’’ అని గ్రేట్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకుడు హరి కృష్ణన్ నాయర్ తెలిపారు. డేటా సైన్స్ నిపుణుల నియామకాల్లో బెంగళూరు టాప్లో ఉండగా.. తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.
చదవండి: