RGUKT UG AP IIIT Admissions 2023:ఫేజ్ 2 ఎంపిక జాబితా విడుదల... కౌన్సెలింగ్ ఎప్పుడంటే
ఈ అభ్యర్థులకు ఫేజ్ 2 కౌన్సెలింగ్ నూజివీడు క్యాంపస్, నూజివీడు, ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ - 521202లో జరుగుతుంది. RGUKT UG అడ్మిషన్స్ ఫేజ్ 2 తాత్కాలిక ఎంపిక జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://admissions23.rgukt.in/ind/P2_GN.pdf
RGUKT UG అడ్మిషన్లు - ముఖ్యమైన తేదీలు:
• ఫేజ్ 2 కౌన్సెలింగ్ వేదిక: నూజివీడు క్యాంపస్, నూజివీడు, ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ -521202
• ఫేజ్ 2 కౌన్సెలింగ్ తేదీలు: ఆగస్టు 09, 2023 నుండి ఆగస్టు 10, 2023 వరకు
• తరగతులు ప్రారంభం: ఆగస్టు 17, 2023
IIIT: కౌన్సెలింగ్‌కు హాజరు కాని విద్యార్థులకు మరో అవకాశం
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కౌన్సెలింగ్ జూలై 21తో ముగిసింది. రెండు రోజుల్లో 1,085 మందికి గాను 956 మందికి అడ్మిషన్లు కల్పించారు. ఇడుపులపాయ ఆర్‌కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి మొదటి రోజు 444మంది అడ్మిషన్లు పొందారు. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 1086 మందికి కాల్ లెటర్స్ పంపించగా, జూలై 24, 25న నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 900 మంది హాజరయ్యారు. క్యాంపస్‌లో 1100 సీట్లు ఉండగా, స్పోర్ట్సు, ఎన్‌సీసీ వంటి ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్ మెరిట్ లిస్టు సిద్ధం కాలే దు. ఈ నేపథ్యంలో 1086 మంది మెరిట్ జాబి తా సిద్ధం చేసి, కాల్ లెటర్లు అందజేశారు.