Engineering: యాజమాన్య కోటాలోనూ రిజర్వేషన్
Sakshi Education
ఇంజనీరింగ్ యాజమాన్య సీట్లలో రిజర్వేషన్ అమలు చేయాలని, ఈ దిశగా విస్తృత చర్చ చేపట్టాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజు అభిప్రాయపడ్డారు.
ఈమేరకు ఆయన అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఛైర్మన్ కు ఇటీవల లేఖరాశారు. ఇంజనీరింగ్ కనీ్వనర్ కోటా సీట్ల పంపిణీలో రిజర్వేషన్ అమలవుతోందని, ఆర్టికల్ 74 ఇందుకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. అయితే, యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల భర్తీలో ఈ అవకాశం లేకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్లను ఇష్టానుసారం అధిక రేట్లకు అమ్ముకుంటున్నాయని, డబ్బున్న వాళ్లకే సీట్లు వస్తున్నాయని తెలిపారు. ఈ విధానంలో మార్పు కోసం దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరముందని ఆచారి తెలిపారు.
చదవండి:
Faculty: బ్యాక్‌లాగ్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు
Published date : 02 Dec 2021 04:48PM