Skip to main content

Engineering: భారీగా మిగిలిన సీట్లు

కన్వీనర్‌ కోటా కింద ప్రత్యేక రౌండ్‌లో ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్‌ 23న పూర్తయింది.
Engineering
భారీగా మిగిలిన సీట్లు

ఇప్పటివరకూ 71.60 శాతం సీట్లు ఎంసెట్‌ అర్హులకు కేటాయించినట్లు తెలంగాణ సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్ మిట్టల్‌ తెలిపారు. వివిధ బ్రాంచుల్లో ఇంకా 22,679 సీట్లు మిగిలాయన్నారు. 4,674 మందికి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద సీట్లు దక్కాయని తెలిపారు. ‘రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల (ఒకటి ప్రైవేటు, 8 ప్రభుత్వ) పరిధిలో వందశాతం ప్రవేశాలు జరిగాయి. ఒక కాలేజీలో మాత్రమే జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. ప్రత్యేక రౌండ్‌లో సీట్లు దక్కిన విద్యార్థులు నవంబర్‌ 26న సంబంధిత కాలేజీలో రిపోరి్టంగ్‌ చేయాలి. ఫార్మసీ (ఎంపీసీ విభాగం)లో మొత్తం 172 కాలేజీల్లో 4,426 సీట్లు అందుబాటులో ఉంటే 223 సీట్లు కేటాయించగా, 4,203 సీట్లు ఖాళీగా ఉన్నాయి’ అని చెప్పారు. ఇంజనీరింగ్‌లో కొన్నేళ్లుగా డిమాండ్‌ లేని సివిల్, మెకానికల్‌ కోర్సులను చాలా కాలేజీలు రద్దు చేసుకున్నాయి. దీంతో దాదాపు 2 వేల సీట్లు అందుబాటులో లేకుండా పోయాయి. వాటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్ కోర్సులకు అనుమతి తెచ్చుకున్నాయి. 

ఈసారీ కంప్యూటర్‌ కోర్సుల వైపే..

రాష్ట్రంలో ఈసారి 1,21,480 మంది ఎంసెట్‌లో అర్హత సాధించారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద మొత్తం 79,856 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 57,177 (71.60 శాతం) సీట్లు కేటాయించారు. ప్రత్యేక రౌండ్‌లో నవంబర్‌ 20, 21 తేదీల్లో ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. దీంతో 14,919 మంది... 4,06,096 ఆప్షన్లు ఇచ్చారు. అభ్యర్థులు ఎక్కువగా కంప్యూటర్‌ సైన్స్, ఆరి్టఫీíÙయల్‌ ఇంటెలిజెన్స్, ఐటీ, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ లాంటి కోర్సులకే ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్‌ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపలేదు. రెండు విడతల కౌన్సెలింగ్‌లో సీటు రాని వాళ్లంతా ప్రత్యేక రౌండ్‌లో కంప్యూటర్‌ సైన్స్ ఇంజనీరింగ్‌ (సీఎస్‌సీ)కి ఆప్షన్ ఇచ్చారు. ఫలితంగా 92.12 శాతం సీట్లు కేటాయించారు. ఆ తర్వాత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్‌ను ఎంచుకున్నారు. ఈ విభాగంలో 91.07 శాతం సీట్లు కేటాయించారు. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 38.31 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. దీంతో 3,851 సీట్లు మిగిలిపోయాయి. మెకానికల్‌లో 28.18 శాతం భర్తీ అయ్యాయి. ఫలితంగా 4,239 సీట్లు మిగిలిపోయాయి. ఈఈఈ బ్రాంచ్‌లో 41.88 శాతం సీట్లు భర్తీ అయితే, 4,151 సీట్లు మిగిలిపోయాయి. 

చదవండి: 

Engineering Guidance

Engineering Study Material

Education: ఉపాధి వేటలో విజయం సాధించేలా కోర్సులు

Published date : 25 Nov 2021 02:35PM

Photo Stories