New Courses: కొత్త కోర్సులకు ఎన్ వోసీ అవసరం లేదు
ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మార్గదర్శకాల మేరకు కోర్సుల నిర్వహణ ఉంటుందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జేఎన్ టీయూ అఫిలియేషన్ నిబంధనల మేరకు కొత్త కోర్సుల ప్రారంభానికి, తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్ వోసీ తప్పనిసరి అంటూ జారీచేసిన మార్గదర్శకాలను నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన 11 ఇంజనీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని జేఎన్ టీయూను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనిధి, కేశవ్ మెమోరియల్, సీఎంఆర్, వీఎన్ ఆర్, వర్ధమాన్ తోపాటు మరో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం విచారించింది. ఏఐసీటీఈ మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు నడుచుకుంటాయని, కొత్త కోర్సుల ప్రారంభానికి సంబంధించి నిబంధనల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి, జేఎన్ టీయూకు ఎటువంటి అధికారం లేదని ఇంజనీరింగ్ కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
చదవండి: