ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో మన ఐఐటీ
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 15న ఢిల్లీలో విడుదల చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకుల్లో హైదరాబాద్ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకులు సాధించాయి. అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్) ఇచ్చిన ర్యాంకుల్లో IIT(H) 14వ ర్యాంకును (2021లో 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్ లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో IIT(H) టాప్–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. దేశంలోకెల్లా ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ తొలిస్థానంలో నిలిచి వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది.
చదవండి: సరికొత్త కోవిహోం కిట్‌ను రూపొందించిన ఐఐటీ?
హెచ్‌సీయూ భళా..
జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓవరాల్ విభాగంలో 20వ ర్యాంకు, రీసెర్చ్‌లో 27వ ర్యాంకు సాధించింది. వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా వర్సిటీ 22వ ర్యాంకు పొందింది. ఓవరాల్ ర్యాంకుల విభాగంలో 46వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలోవరంగల్ ఎన్‌ఐటీ 21 ర్యాంకు ఓవరాల్ విభాగంలో 45వ ర్యాంకు పొందింది. ఇంజనీరింగ్ విద్యలో జేఎన్‌టీయూ (హైదరాబాద్)కు జాతీయస్థాయిలో 76వ ర్యాంకు దక్కింది. కాగా, ప్రతిభగల విద్యా ర్థులు, సమర్థులైన అధ్యాపకుల కృషివల్లే IIT(H) దినదినాభివృద్ధి చెందుతోందని సంస్థ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు. వివిధ విభాగాల్లో OU ర్యాంకులు సాధించడంపై వర్సిటీ వీసీ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: ఐఐఐటీహెచ్‌లో రూ.110 కోట్లతో ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్’