Skip to main content

సరికొత్త కోవిహోం కిట్‌ను రూపొందించిన ఐఐటీ?

కోవిడ్‌ పరీక్షలను మరింత సులభతరం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు సరికొత్త కిట్‌ అభివృద్ధి చేశారు.
నోరు లేదా ముక్కు నుంచి సేకరించిన ద్రవ నమూనాల ఆధారంగానే కోవిడ్‌ను గుర్తించగలగడం ఈ కిట్‌ ప్రత్యేకత. కోవిహోం అని పిలుస్తున్న ఈ కిట్‌ను త్వరలోనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని తయారీ ఖర్చు రూ.400 వరకు ఉందని, ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ఖర్చు రూ.300కు తగ్గుతుందని కిట్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ శివ్‌ గోవింద్‌సింగ్‌ తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌లో ఐ కోవిడ్‌ పేరుతో అభివృద్ధి చేసిన అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఈ కిట్‌ను ఉపయోగించాలని పేర్కొన్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : సరికొత్త కోవిహోం కిట్‌ను రూపొందించిన ఐఐటీ?
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు
ఎందుకు : కోవిడ్‌ పరీక్షలను మరింత సులభతరం చేసేందుకు...
Published date : 16 Jul 2021 06:35PM

Photo Stories