Skip to main content

Engineering: ఇంజనీరింగ్‌లో.. న్యాక్‌ రెండు కొత్త కోర్సులకు శ్రీకారం..

ఇంజనీరింగ్‌... ఒకప్పుడు విపరీతంగా డిమాండ్‌ ఉండేది. ఏటా వేలాది మంది ఇంజనీరింగ్‌ పూర్తి చేసి వస్తుండటంతో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది.
Engineering
ఇంజనీరింగ్‌లో.. న్యాక్‌ రెండు కొత్త కోర్సులకు శ్రీకారం..

ఒకవేళ దొరికినా అరకొర జీతం ఇస్తున్నారు. ఇందులో సివిల్‌ ఇంజనీర్లు కూడా ఉన్నారు. దీన్ని గుర్తించిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్ స్ట్రక్షన్ (న్యాక్‌) రెండు కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఇది సివిల్‌ ఇంజనీర్ల జీ(వి)తాల్లో కొత్త వెలుగునింపుతోంది. 

కన్ స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కోర్సు:

ఓ నిర్మాణాన్ని ప్రారంభించాలంటే దానికి ఓ ప్లాన్ ఉండాలి. దాని ప్రకారం నిర్మాణం రూపొందేందుకు అనుసరించాల్సిన విధానాలను ఈ కోర్సు ద్వారా నేర్పుతారు. 

క్వాంటిటీ సర్వే:

నిర్మాణానికి ఖర్చును ఎలా చేయాలి.. అవసరానికి మించి అవుతోందా.. మరింత ఖర్చు చేయొచ్చా.. ఏ సమయానికి ఏయే వస్తువులు వాడాలి.. వాటిని ఎప్పుడు కొనాలి.. మార్కెటింగ్‌ ఎలా.. ఇలాంటివి ఈ కోర్సు చెబుతుంది.

ఆ రెండు కోర్సులతో..

బీటెక్‌ సివిల్‌ ఇంజనీర్లకు మంచి డిమాండ్‌ రావాలంటే వారి డిగ్రీకి అదనపు హంగు చేర్చాలని న్యాక్‌ నిర్ణయించింది. దీనికోసం ‘కన్ స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌’, ‘క్వాంటిటీ సర్వే’డిప్లొమా కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు ఈ కోర్సులను నిర్వహిస్తున్నా, ఫీజు రూ.5 లక్షల వరకు ఉండటంతో అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో రూ.లక్షన్నరకే ఈ కోర్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. కోర్సు నిర్వహించటంతో గుర్తింపు రాదని, అది పూర్తయ్యాక అందే సరి్టఫికెట్‌కు విలువ ఉండాలన్న ఉద్దేశంతో జేఎన్ టీయూతో చర్చించి న్యాక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కోవిడ్‌ మొదలు కావడానికి ముందు సంవత్సరమే ఈ ఒప్పందం కుదిరింది. న్యాక్‌ వేదికగా జేఎన్ టీయూ ఈ కోర్సులను నిర్వహిస్తోంది. ఈ రెండింటిలో అవగాహన ఉన్నవారికి నిర్మాణ సంస్థలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. తెలంగాణలోనే కాదు, దేశవిదేశాల్లోనూ ఈ కోర్సులు నేర్చుకున్న వారికి మంచి డిమాండ్‌ ఉంది. తొలి సంవత్సరం 150 మంది బీటెక్‌ గ్రాడ్యూయేట్లు ఈ కోర్సుల్లో చేరారు. ఆ తర్వాత కోవిడ్‌ వల్ల రెండేళ్లు వారి సంఖ్య తగ్గగా మళ్లీ ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. 

క్యాంపస్‌ ఇంటర్వ్యూలు..

ఈ కోర్సులు పూర్తి కాకుండానే నిర్మాణ సంస్థలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు ముందుకొస్తున్నాయి. వార్షిక ప్యాకేజీగా రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ప్రకటిస్తున్నాయి. ‘ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ ఇన్ స్టిట్యూట్‌ నిర్వహించే పరీక్షకు హాజరై తద్వారా విదేశాలకు వెళ్లాలన్న ఆలోచన ఉంది. ఆ పరీక్షకు వెళ్లేందుకు జేఎన్ టీయూ అందించే ప్రత్యేక కోర్సు సరి్టఫికెట్‌ అవకాశం కల్పిస్తోంది’అని ప్రవీణ్‌రెడ్డి అన్నారు. ఈయన న్యాక్‌ కోర్సు పూర్తి చేసి ఇటీవలే ఉద్యోగం పొందారు. 

మంచి గుర్తింపు

ఈ రెండు కోర్సులకు తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. తొలుత వేర్వేరు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు వచ్చారు. కోవిడ్‌ వల్ల కొంత తగ్గినా మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. ఇటీవలే 50 సీట్లకు తొలి విడత ఎంపిక పూర్తి చేశాం. మరో 50 సీట్లకు ఎంపిక ప్రారంభించాం. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

– భిక్షపతి, డీజీ న్యాక్‌

ఉద్యోగావకాశాలు ఎక్కువ... 

ఈ రెండు కోర్సులు చేసిన బీటెక్‌ సివిల్‌ ఇంజనీర్లకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కోర్సు పూర్తి కాకుండానే కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వూ్యలు నిర్వహిస్తుండటమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం కోవిడ్‌ తగ్గుముఖం పట్టినందున డిమాండ్‌ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం.

– శాంతిశ్రీ ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌

నిజామాబాద్‌కు చెందిన కేతి శివకుమార్‌ బీటెక్‌ సివిల్‌ పూర్తయి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో సైట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇది నాలుగో సంవత్సరం. కానీ, అతను పొందుతున్న నెలవారీ జీతం రూ.11,500. 

హైదరాబాద్‌కు చెందిన ప్రణీత్‌రెడ్డి 2016లో బీటెక్‌ సివిల్‌ పూర్తి చేసి ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌ కంపెనీలో చేరాడు. మూడేళ్లు రూ.14 వేల జీతానికి పనిచేశాడు. ఆ తర్వాత న్యాక్‌ డిప్లొమా కోర్సు చేశాడు. కోర్సు పూర్తి కాకుండానే క్యాంపస్‌ ఇంటర్వూ్యలో ఎంపికయ్యాడు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల సైట్‌ వద్ద డ్యూటీ. మొదటి నెల జీతం రూ.23 వేలు. 
చదవండి:

Engineering: ‘బీ’ కేటగిరీ సీట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ

Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!

Published date : 17 Sep 2021 05:36PM

Photo Stories