Skip to main content

Potti Sriramulu Engineering College: పొట్టిశ్రీరాములు ఇంజినీరింగ్‌ కాలేజీకి నాక్‌ ఏ డబుల్‌ ప్లస్‌ గ్రేడ్‌

వన్‌టౌన్‌(విజయవాడ): పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీకి యూజీసీ అనుబంధ సంస్థ నాక్‌ నుంచి ‘ఏ డబుల్‌ ప్లస్‌’ గ్రేడ్‌ను పొందామని ఆ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు చలువాది మల్లికార్జునరావు, పి.లక్ష్మణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఆ కళాశాల ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
మాట్లాడుతున్న కార్యదర్శి లక్ష్మణస్వామి
మాట్లాడుతున్న కార్యదర్శి లక్ష్మణస్వామి

కేంద్ర ప్రభుత్వానికి చెందిన యునివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ అనుబంధ సంస్థ నాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌) కళాశాలల పనితీరుపై పరిశీలన చేసి గ్రేడింగ్‌లను ప్రకటిస్తుందన్నారు. దాని ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతులు, ఇతర అంశాల్లో గుర్తింపు లభిస్తుందన్నారు. దానికి సంబంధించి గత మాసంలో నాక్‌ నియమించిన ముగ్గురు విద్యావేత్తలు బృందం తమ కళాశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను అందించిందన్నారు. నాక్‌ సంస్థ ఈ నెల 11వ తేదీన తమ కళాశాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఏ డబుల్‌ ప్లస్‌’ గ్రేడ్‌ను ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో సుమారు 350 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా తమ కళాశాల ‘ఏ డబుల్‌ ప్లస్‌’ గ్రేడ్‌ను పొందిన ఏకై క కళాశాలగా నిలిచిందన్నారు సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, కేబీఎన్‌ కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాసు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పతంజలిశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Published date : 13 Apr 2023 06:49PM

Photo Stories