Skip to main content

National Highways: ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,266 కోట్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో జాతీయ రహదా­రులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Government officials discussing national highway development plan  Infographic showing Rs.7,266 crore investment in Andhra Pradesh highways  Rs.7,266 crores for construction of National Highways in Andhra Pradesh

ఈ మేరకు 2024–25 వార్షిక ప్రణాళికను ఆమోదించింది. కీలకమైన విజయ­వాడ తూర్పు బైపాస్‌తో సహా పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2024–25 వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన ప్రాజెక్టులు ఇవీ..
➬ కృష్ణా జిల్లా రామారావు పేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ వరకు నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్‌ నిర్మాణానికి రూ.2,716 కోట్లు. 
➬ వినుకొండ – గుంటూరు నాలుగు లేన్ల రహదారికి రూ.2,360కోట్లు
➬ అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్‌ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.906 కోట్లు
➬ విజయవాడలోని మహానాడు జంక్షన్‌ నుంచి నిడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.669కోట్లు


➬ చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై రణస్థలం వద్ద విడిచిపెట్టిన ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని  పూర్తిచేసేందుకు రూ.325కోట్లు
➬ గన్నవరం సమీపంలోని గుండు­గొలను ‘గామన్‌ జంక్షన్‌’ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ.150కోట్లు
➬ జాతీయ రహదారి 44పై 416 కి.మీ. వద్ద అసంపూర్తిగా ఉన్న నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసేందుకు రూ.140 కోట్లు

Foreign Investments: గడిచిన ఐదేళ్లలో ఏపీలోకి రూ.7,371 కోట్ల విదేశీ పెట్టుబడులు

Published date : 09 Aug 2024 10:07AM

Photo Stories