ఇంజనీరింగ్ విద్యార్థులకు వేసవి సెలవుల్లేవ్!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు వేసవి సెలవులను జేఎన్‌టీయూ రద్దు చేసింది.
ఈనెల 17 నుంచి 29 వరకు వేసవి సెలవులుగా పేర్కొంటూ గతంలో జారీ చేసిన అకడమిక్ కేలండర్‌ను సవరించింది. తాజా అకడమిక్ కేలండర్‌ను బుధవారం జారీ చేసింది. ఇందులో వేసవి సెలవులను తొలగించి విద్యా బోధనను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఫస్టియర్ మినహా మిగతా సంవత్సరాల విద్యార్థులు సెకండ్ సెమిస్టర్‌కు కోర్సుల వారీగా తరగతుల నిర్వహణ, మిడ్ టర్మ్ పరీక్షలు, ప్రిపరేషన్ హాలిడేస్, సెమిస్టర్ ఎండ్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసి జారీ చేసింది.
Check Study Material useful for Engineering Students
దీనిప్రకారం ఆగస్టు 28తో అన్ని కోర్సుల సెకండ్ సెమిస్టర్ ముగియనుంది. బీఈ/బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్–డి కోర్సులకు ఈ అకడమిక్ కేలండర్‌ను జారీ చేసింది. బీటెక్, బీఫార్మసీ రెండో, మూడో సెమిస్టర్ విద్యార్థులకు మొదటి మిడ్ టర్మ్ పరీక్షలను ఈనెల 31 నుంచి వచ్చే నెల 5 వరకు నిర్వహించాలని, మార్కులను జూన్ 11 లోగా వర్సిటీకి సమర్పించాలని పేర్కొంది. సెకండియర్ మిడ్ టర్మ్ పరీక్షలను జూలై 19 నుంచి 24 వరకు నిర్వహించాలంది. సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 16 నుంచి 28 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను సవరించింది. అలాగే ఎంబీఏ, ఎంసీఏ సెకండియర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను, ఫార్మ్–డి 2, 3, 4, 5 సంవత్సరాల పరీక్షలను జూలై 19 నుంచి 31 వరకు నిర్వహించాలని చెప్పింది.

Published date : 20 May 2021 02:55PM