Skip to main content

ఇంజనీరింగ్‌ పీజీసెట్‌ – 2021 దరఖాస్తు గడువు మే 7 వరకు పెంపు

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)ఇంజనీరింగ్‌ పీజీ సెట్‌–2021 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు కన్వీనర్‌ లక్ష్మీనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్‌ 30తో దరఖాస్తుల గడువు ముగియగా, కరోనా కారణంగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. రూ.250 అపరాధ రుసుముతో జూన్‌ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Published date : 01 May 2021 05:34PM

Photo Stories